5 రోజుల పనిదినాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

5 రోజుల పనిదినాలు అమలు చేయాలి

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

భువనగిరిటౌన్‌ : యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్‌ ఆఫీస్‌ నుంచి పాత బస్టాండ్‌ మీదుగా వినాయక చౌరస్తా వరకు ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడారు. బ్యాంకింగ్‌ రంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సీసీ సభ్యుడు ఈ.రఘు, కెనరా, యూనియన్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంకులతోపాటు, నల్లగొండ డీసీసీబీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజులు బ్యాంకు సేవలకు విరామమే..

జిల్లా వ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా సెలువు వచ్చాయి. శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో సేవలు నిలిచిపోయాయి. ఇక, రెండో శనివారం, ఆదివారం, సోమవారం (వినాయక చవితి) కావడంతో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం వరకు బ్యాంకు లావాదేవీలకు విరామం కలగనుంది. దీంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులు ఆన్‌లైన్‌ సేవలు ప్రత్యామ్నాయం కానున్నాయి. అయితే చెక్కుల క్లియరెన్స్‌, డీడీల చెల్లింపులు, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాల వంటి కార్యకలాపాలు బ్యాంకులు తిరిగి తెరిచే వరకు నిలిచిపోనున్నాయి.

ఫ డిమాండ్లు నెరవేర్చాలని బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement