సంస్థాన్ నారాయణపురం : వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, సర్పంచుల ఫోరం రాష్ట్ర జేఏసీ మాజీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ లోవోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో ఏఈ దివ్యకు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ భిక్షం, చిలువేరు భిక్షపతి, బొడ్డుపెళ్లి గాలయ్య, జక్కిడి యాదిరెడ్డి, ఉపల ఆంజనేయులు, పాలకూర్ల సతీష్ గౌడ్, డాక్టర్ ఎర్రోళ్ల లింగస్వామి, రాసాల వెంకటేశం, చిలువేరు శంకర్, ఎడ్ల సత్తయ్య యాదవ్, ఎర్రోళ్ల వెంకటేష్, చిలువేరు వెంకటేశం, బి.రమేష్ గౌడ్, పవన్ కళ్యాణ్, జగ్గు, వెంకటేశం పాల్గొన్నారు.


