ఆదర్శమూర్తి వినోబాభావే | - | Sakshi
Sakshi News home page

ఆదర్శమూర్తి వినోబాభావే

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

ఫ గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి : భూదానోద్యమానికి ఆద్యుడైన ఆచార్య వినోబాభావే ప్రతిఒక్కరికీ ఆదర్శమూర్తని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వినోబాభావే జయంతిని పురస్కరించుకుని పోచంపల్లిలోని టూరిజం పార్కు ఆవరణలో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోబాభావే దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి 44 లక్షల ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచిపెట్టారన్నారు. కార్యక్రమంలో వినోబాభావే సేవా సమితి నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, వేశాల మురళి, చింతకింది రమేశ్‌, భారత భూషణ్‌, భారత భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement