భూదాన్‌పోచంపల్లి : పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టిసారించాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అన్నారు. గురువారం ఆమె పోచంపల్లిలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మట్లాడారు. గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ, సూపరింటెండెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి, ఏపీఓ కృష్ణమూర్తి, హౌజింగ్ ఏఈ శివాజీ, కార్యదర్శులు పాల్గొన్నారు.
10బిఎన్‌జి33 విద్యార్థులతో డిప్యూటీ కమిషనర్ సంతోష్‌కుమార్, కేవీ సిబ్బంది
కేవీఎస్‌లో ఉత్సాహంగా యోగాసన పోటీలు
భువనగిరిటౌన్ : పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్)భువనగిరిలో నిర్వహిస్తున్న 55వ కేవీఎస్ జాతీయ స్థాయి క్రీడాపోటీలు రెండోరోజు గురువారం ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు యోగాసనాల్లో తమ ప్రతిభను చాటారు. హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను పరిశీలించి, క్రీడాకారులను అభినందించారు. గురువారం అండర్–17, 19 ఆర్టిస్టిక్ యోగాసన, అండర్–19 బాలుర యోగాసన ఫైనల్ పోటీలు ముగిశాయని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. కార్యక్రమంలో సూర్యప్రకాశ్, రతీష్, నందారం కృపాకర్ పాల్గొన్నారు.
రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
బొమ్మలరామారం: వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని డీఏఓ వెంకట రమణా రెడ్డి సూచించారు. బొమ్మలరామారం మండలం మర్యాలలో గురువారం రైతులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఆత్మ చైర్మన్ ఎనగండ్ల సుధాకర్, ఏఓ దుర్గేశ్వరి, సర్పంచ్‌లు సంగి గణేష్, వెంకటేష్, రవీందర్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎనగండ్ల వీరేశం, శ్రీను నాయక్, మౌనిక రెడ్డి, మదన్, సీమ, వరలక్ష్మి, ఆదిల్ పాల్గొన్నారు.


