నల్లగొండ టూటౌన్ : సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 45వ సెషన్‌కు ఎంజీయూ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. గురువారం ఆయన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నవంబర్ 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ కార్యక్రజువఛజులో దక్షిణ భారతదేశం నుంచి చరిత్రకారులు, అధ్యాపకులు హాజరై వారి పరిశోధనా పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1200 మందికి పైగా చరిత్రకారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, సిబ్బంది విజయబాబు, అరుణప్రియ, వసంత, హరీష్ కుమార్, శ్రీదేవి, అల్వాల రవి, మిరియాల రమేష్, ఉపేందర్‌రెడ్డి, మారం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


