సూర్యాపేటటౌన్ : గుజరాత్‌లో నవంబర్ 15 నుంచి 21 వరకు జరగనున్న జాతీయ స్థాయి ప్రేరణ అనుభవపూర్వక విద్యా కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రేరణ నోడల్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఆదినారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గరిడేపల్లి మండలం కల్మలచెరువు జెడ్పీహెచ్‌ఎస్ 9వ తరగతి విద్యార్థి జి. శ్రీరామ్, సూర్యాపేట మండలం ఇమాంపేట టీఎస్‌ఎంఎస్ 9వ తరగతి విద్యార్థిని ముప్పని రిత్వికారెడ్డి ఎంపికై నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యార్థుల ప్రయాణ ఏర్పాట్లు తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.


