నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను తీవ్రంగా అవమానిస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మాదిగలకు గౌరవం దక్కిందని, దళితులకు వివిధ సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎల్లప్పుడూ కేసీఆర్‌కు మాదిగలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో డప్పులు మోగించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు. స్పీకర్ పదవిని అవమానపరిచేలా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పదే పదే దళితుడు అంటూ ఆ పార్టీ నేతలే ప్రస్తావిస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా మాదిగలను ఏకం చేసి ఆయన ఇంటిని 2లక్షల డప్పులతో ముట్టడిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం గా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారని అన్నారు. పాలాభిషేకం కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, నాయకులు పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, నోముల కేశవరాజులు, పెండెం సదానందం, తక్కళ్లపల్లి ప్రబాకర్‌రావు, వీర్లపాటి రమేష్, అమీర్ పాష, ఇమడపాక వెంకన్న, చెట్టిపల్లి జానయ్య, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్న, యానాల లింగారెడ్డి, గుర్రం గణేష్, మల్లేష్, దైద పరమేశం, జిల్లా సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీఎం ఇంటిని 2లక్షల డప్పులతో ముట్టడిస్తాం
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య
ఫ కేసీఆర్ మద్దతుగా డప్పుల మోత


