యాదగిరిగుట్ట : యువతలో సామాజిక చైతన్యం, ప్రశ్నించేతత్వం, శాసీ్త్రయ ఆలోచనా విధానం పెంపొందించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న ఏఐవైఐఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లో ఉందని, యువతలో చైతన్యం పెరిగేతేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు. యువత సమస్యలపై ఏఐవైఎఫ్ మరింత బలమైన ఉద్యమాలు నిర్మించి పోరాటాలు ఉధృతం చేయాలని సూచించారు. ప్రస్తుతం నక్సల్ అనే పదం పోయిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా అంటున్నారని. కానీ జెన్‌జీ రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యువత ముందుకు వచ్చారన్నారు. స్థానిక సమస్యలపై యువత దృష్టి పెట్టాలని, యువత ప్రజల అభిమానాన్ని సంపాదించి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువత అమరుల త్యాగాలను యువత గుర్తుపెట్టుకొని వారి ఆశయాలను సాధించే దిశగా పని చేయాలన్నారు. ఈ ప్రతినిధుల సభలో సౌహార్ధ సందేశాలను ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటి నరసింహ, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా, ప్రధాన కార్యదర్శి సుఖ్‌జిందర్ మహేశ్వరీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రి, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ లింగం రవి, టి.సత్య ప్రసాద్, శ్రీమాన్, యుగంధర్, చేపూరి కొండల్, సీసీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బోలగాని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, చెక్క వెంకటేష్, ఎండీ ఇమ్రాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండీ నహీం, ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,
ఎమ్మెల్యే సాంబశివరావు
ఫ యాదగిరిగుట్టలో ముగిసిన
ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు


