క్యాంపస్ సమాచారం
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) వైస్ ఛాన్స్‌లర్(వీసీ) ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం ఎంజీయూలో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐసీటీ, ఐయూసీ చెస్ టోర్నమెంట్‌ను వీసీ ప్రారంభించి మాట్లాడారు. చెస్ ఆడటం ద్వారా తార్కిక ఆలోచన, వ్యూహాత్మక ప్రణాళిక, సహనం, ఓర్పు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మద్దిలేటి పుసుపుల, ఫిజికల్ డైరెక్టర్లు మురళి, శ్రీనివాస్‌రెడ్డి, చెస్ సెలెక్టర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్


