విద్యార్థినుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినుల రక్షణలో ప్రభుత్వాలు విఫలం

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

భువనగిరిటౌన్‌ : విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అన్నారు. భువనగిరి పట్టణంలోని వెన్నెల కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్‌ శిక్షణా తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ.. దేశంలో మహిళలు, విద్యార్థినులపై హింస, వేధింపులు, వివక్ష కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. జెన్‌జీ విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థినులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పోరాట స్ఫూర్తిని చాటారని అన్నారు. తమ విద్యా హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం యువత ముందుకు వస్తున్న తరుణంలో వారి స్వరాన్ని అణిచివేయకుండా ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం–2020 వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ.. మహిళలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి మల్లేష్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి బి. అనురాధ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దీపిక, సుమ, కృపా జార్జీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియ రాజు, జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ ఇందు రాణి, జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్‌, పట్టల ఉదయ్‌, ధరావత్‌ జగన్‌, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫ ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు శిల్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement