భూదాన్‌పోచంపల్లి : పర్యావరణ పరిరక్షణకు హరిత ఇంధనం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ కెఎస్‌ఎంఎస్ రాఘవరావు అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘హార్నెసింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ టూ డ్రైవ్ సస్టెనబిలిటీ అండ్ కాంట్యాట్ క్‌లైమేట్ ఛేంజ్ వరల్డ్‌వైడ్’ అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో హరిత సాంకేతికత ఎంతో అవసరమని అన్నారు. అనంతరం గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రమేశ్ కె. గూడురు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ, ఉత్పాదక టెక్నాలజీని అభివృద్ది చేయడం ఎంతో ఆవసరం అన్నారు.ఈ సదస్సులో ఏఐ, రోబోటిక్స్, బయోడైవర్సిటీ, క్లీన్ ఎనర్జీ, క్‌లైమేట్ ఛేంజ్ వంటి సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ రెడ్డి కామేశ్, ప్రొఫెసర్ జెఎస్‌ఎస్ ప్రకాశ్, యూనివర్సిటీ అడ్వైజర్, మాజీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూనం మాలకొండయ్య, డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర్‌రావు, డీన్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్
కెఎస్‌ఎంఎస్ రాఘవరావు


