నల్లగొండ టూటౌన్ : యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే సహించేది లేదని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహన్ అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయకుండా యూనివర్సిటీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీసీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, రాష్ట్రకార్యవర్గ సభ్యులు శంకర్, నగేష్, అజయ్, సంపత్, మౌనేష్, రాజేష్, గణేష్, మల్లిఖార్జున్, సాయి, సిద్దు, సిరిచందన, శివానీ పాల్గొన్నారు.
ఫ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
ఛత్రపతి చౌహన్


