భూదాన్‌పోచంపల్లి : మండలంలోని అంతమ్మగూడెం గ్రామంలో కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రసాయన కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ పరిఽధిలోని రసాయన కంపెనీలు వెదజల్లుతున్న పలు రకాల కాలుష్య రసాయనాల కారకాలపై పీసీబీ ఇచ్చిన రిపోర్టులను ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే గ్రామంలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన చుట్టాలు, గ్రామస్తులు ఫ్లెక్సీలను ఆసక్తి తిలకించారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


