నోటీసుల జారీ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

నోటీసుల జారీ పకడ్బందీగా నిర్వహించాలి

Sep 4 2026 2:42 AM | Updated on Sep 4 2026 2:42 AM

భువనగిరి: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణను పకడ్బందీగా నిర్వహించాలని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక సమగ్ర సవరణ పరిశీలకురాలు విజయేంద్రా అన్నారు. గురువారం భువనగిరి మండలం, అనంతారం గ్రామంలో చేపట్టిన సర్‌ నోటీసుల జారీ విచారణ ప్రక్రియను పరిశీలించారు. అంతకు ముందు గ్రామంలో 11, 12పోలీంగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఆమె వెంట కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ జగన్మోహన్‌ప్రసాద్‌, ఏరోప్లేన్‌ ప్రణయ్‌కుమార్‌ తదితరులున్నారు.

10న చలో హైదరాబాద్‌

భువనగిరిటౌన్‌ : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌– ఉద్యోగుల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్‌ మందడి ఉపేందర్‌ రెడ్డి కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌ ఎదుట సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు చికూరి జగన్మోహన్‌ ప్రసాద్‌, డీఏఓ రమణారెడ్డి, టీజీఓ కార్యదర్శి సీహెచ్‌ శ్రీనివాస్‌, ట్రెసా జిల్లా అధ్యక్షుడు కృష్ణ, డీఎంహెచ్‌ఓ మనోహర్‌, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖాదిర్‌, కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు యాదయ్య పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ప్రశాంతత

భువనగిరి: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ప్రశాంతత కలుగుతుందని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజనేయులు అన్నారు. భారత ప్రభుత్వం నిర్వహించే ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌ 2026–27కు సంబంధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement