రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బత్తిని నాగరాజు లైఫ్ సైన్సెస్‌లో ఆలిండియా 162వ ర్యాంక్ సాధించిన ఆయన, డిసెంబర్ 2011లో ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ పరిశోధన చేస్తున్నారు. ఆయన రెండు భారతీయ పేటెంట్లను దాఖలు చేయడమే కాకుండా, డిగ్రీ స్థాయి మైక్రోబయాలజీకి సంబంధించి 6 పాఠ్యపుస్తకాలను రచించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలను ప్రచురించడమే కాకుండా 5 జాతీయ సదస్సులలో సెషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం కళాశాలలో అకడమిక్ కోఆర్డినేటర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అకడమిక్ కౌన్సిల్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బత్తిని నాగరాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్జీ కాలేజీ


