తాళ్లవెల్లెంలలో ఆకట్టుకుంటున్న పరమాత్మ సన్నిధి
చుట్టూ పచ్చదనం, పక్షుల కిలకిలారావాలు.. నగర జీవితంలోని ఉరుకులు పరుగులకు పూర్తిగా భిన్నమైన వాతావరణం. కొద్దిదూరం నడవగానే ప్రకృతి ఒడిలో ఓ చిన్న గోపురం.. లోపలికి వెళ్తే వేణుగోపాలుడి రూపంలో
దర్శనమిచ్చే శ్రీకృష్ణుడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామంలోని ఆర్గానిక్ కృష్ణ మందిరం ప్రత్యేకత ఇది.
ప్రకృతితో మమేకమై పరమాత్మను స్మరించేలా తీర్చిదిద్దిన ఈ మందిరం వద్ద, సుదూర
ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో పాటు నచ్చినన్ని రోజులు ఉండే వెసులుబాటు ఉంటుంది.
చిట్యాల : తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన పానుగుళ్ల యాదయ్య–జయమ్మ దంపతుల ఏకై క కుమారుడు వెంకటేశ్వర్లుది వ్యవసాయ ఆధారిత కుటుంబం. స్వయంకృషితో ఐఐటీ గువహటిలో మాస్టర్స్ పూర్తి చేసిన ఆయన, ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం డీఆర్‌డీఓ (పుణె)లో, యూఏఈలోని పలు ఇంటర్నేషనల్ విద్యాసంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం నారాయణ కాలేజీలో ఐఐటీ–జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే శ్రీకృష్ణుడిపై భక్తిభావం పెరగడంతో ద్వారక, ఉడిపి, పూరీ, మధుర, బృందావన్ లాంటి ఆలయాలను దర్శించారు. భక్తికి వైభవం, ఆర్భాటం కంటే భావం ముఖ్యమనే ఉద్దేశంతో.. ఐఐటీ స్నేహితులు, దాతల సహకారంతో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పన్నెండేళ్ల క్రితం ఆర్గానిక్ కృష్ణ మందిరాన్ని నిర్మించారు.
భక్తులే అర్చకులు..
ఈ మందిరంలో నల్లరాయితో చెక్కిన ముగ్ధ మనోహరమైన కృష్ణుడి విగ్రహంతో పాటు వినాయకుడు, హనుమంతుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి, నంది, సరస్వతీదేవి, నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి నెలా ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తుంటారు. కృష్ణాష్టమి, హోలీ, కార్తికమాసం, ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రణవానంద స్వామి లాంటి ప్రముఖులు ఇక్కడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మందిరంలో ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ అర్చకులు ఎవరూ ఉండరు. భక్తులే స్వయంగా స్వామిని దర్శించుకుని పూజించుకోవచ్చు. దేవుడికి, భక్తుడికి మధ్య ఎవరూ అవసరం లేదని, హృదయంలోంచి వచ్చే ప్రార్థనే అసలైన పూజ అని చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. మందిరంలో బస చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఆరు గదులతో పాటు భోజన ఏర్పాట్లు చేసే సహాయకులు సైతం అందుబాటులో ఉంటారు.
ప్రకృతి మధ్యలో కనువిందు చేస్తున్న ఆర్గానిక్ కృష్ణ మందిరం
ఫ పూజారుల ప్రమేయం లేకుండా పూజలు చేసుకునే
అవకాశం
ఫ మందిరాన్ని నిర్మించిన ఐఐటీ పూర్వ విద్యార్థి
వెంకటేశ్వర్లు
ఫ భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం


