యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ సంప్రదాయంగా జరిపించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాఢ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణ కట్ట, పుష్కరిణి, అన్న ప్రసాద కేంద్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.


