ప్రయాణికుల కిటకిట | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల కిటకిట

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

భువనగిరి : రక్షాబంధన్‌ సందర్భంగా శుక్రవారం భువనగిరి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. మహిళలు, యువతులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కోసం బస్టాండ్‌కు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులతో సందడి కనిపించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా బస్సులు నడిపిప్పటికీ సకాలంలో రాకపోవడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ప్రధానంగా భువనగిరి నుంచి నల్లగొండ, మోత్కూరు వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు వందలాదిగా నిరీక్షించారు. వచ్చిన ఒకటి రెండు బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement