భూదాన్‌పోచంపల్లి: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి సురేశ్‌రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం భూదాన్‌పోచంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖేల్ ఇండియా సంవాద్ (ఖేల్‌కి బాత్ పీఎం మోదీకి సాత్) కార్యక్రమాన్ని తిలకించారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగిస్తూ యువత క్రీడలు, యువ నాయకత్వం ఆవశ్యకత, వికసిత్ భారతత్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాలలో సీజీఏ మొదటి సంవత్సరం చదువుతున్న పిస్టల్ షూటింగ్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్న తప్పెట పవన్‌కుమార్‌ను సన్మానించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ తులసి, క్రీడల ఇన్‌చార్జ్ శివశంకర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సాయివర్ధన్, జ్యోతి, అధ్యాపకులు రాజేశ్వరమ్మ, వెంకట్‌రెడ్డి, సంతోష్‌కుమార్, వెంకటేశం, స్వాతి, శ్రీదేవి, జెవీ రావు, మురళీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, అనురాధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


