కోదాడ : రాఖీ పండుగను పురస్కరించుకొని గురువారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈకో క్లబ్ ఆధ్వర్యంలో చెట్టుకు రాఖీ కట్టారు. చెట్లను రక్షించుకుంటే అవి మనల్ని రక్షిస్తాయని రక్షాబంధన్ ఉత్సవాలను వృక్షాబంధన్‌గా మార్చుకోవాలని ఈ సందర్బంగా ఎంఈఓ సలీం షరీఫ్ కోరారు.
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్‌కు కిరాణ దుకాణం ఉంది. ప్రతి ఏటా సూర్యాపేట–జనగామ హైవే వెంట అర్వపల్లి వైజంక్షన్‌లో రాఖీలు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆయన సర్పంచ్ అయినప్పటికీ గతంలో మాదిరిగానే రాఖీ దుకాణం ఏర్పాటు చేసి గురువారం రాఖీలు విక్రయించారు. తాను సర్పంచ్ అయినప్పటికీ కుటుంబం కోసం వ్యాపారం చేసుకుంటున్నానని విద్యాసాగర్ తెలిపారు.
సర్పంచ్ అయితేనేం..


