స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లొస్తూ..

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

భువనగిరి : స్నేహితుడి అంతక్రియలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన భువనగిరి మండలం వడపర్తి గ్రామం సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం గచ్చుబావి గ్రామానికి చెందిన జెల్ల గణేష్‌(38) తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలో బుధవారం స్నేహితుడి అంతక్రియలకు హాజరయ్యేందుకు వెళ్లాడు. అంతక్రియలు ముగిసిన తర్వాత సాయంత్రం బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో భువనగిరి మండలం వడపర్తి ఎక్స్‌రోడ్‌ వద్ద భువనగిరి–జగదేవ్‌పూర్‌ రోడ్డు మార్గంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న రెడ్‌మిక్స్‌ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement