కేరళ కుట్టిలా... | - | Sakshi
Sakshi News home page

కేరళ కుట్టిలా...

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

మానస

దహారణాల తెలుగమ్మాయి వారణాసి మానస బుధవారం కేరళ కుట్టిలా మారారు. ఓనమ్‌ పండగ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా తయారయ్యారు. ఈ పండగకి కేరళ కుట్టీలు కట్టుకున్నట్లు చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబై, కేరళీయులకు ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపారు మానస. ‘‘ఈ రోజంతా మీకు బంగారంలా మెరిసిపోవాలి. ఓనమ్‌ విందుని మీరు కడుపు నిండా ఆరగించాలి’’ అంటూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు మానస. కేరళ కుట్టిలా మానస డ్రెసప్‌ అయిన తీరుకి అభినందనలు దక్కాయి. ‘సూపర్‌... చాలా అందంగా ఉన్నారు.... దేవకన్యలా ఉన్నారు’... అంటూ పలువురు నెటిజన్లు ప్రశంసలను షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే... ‘మిస్‌ ఇండియా 2020’ కిరీటాన్ని గెలుచుకున్న మానస ‘దేవకీ నందన వసుదేవ, కపుల్‌ ఫ్రెండ్లీ’ చిత్రాల్లో మెరిశారు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న ‘జార్జ్‌ క్రిష్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే ఓ తమిళ సినిమా కూడా మానస డైరీలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement