జాతీయ రహదారి డివైడర్‌పై ఆగి ఉన్న లారీ వెనుక ఇండికేటర్ వేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో నేను అటుగా వెళ్తున్న సమయంలో డివైడర్‌పై లారీ ఆగడం చూశాను. నేను పెట్రోల్ కొట్టించుకొని తిరిగి వెళ్తుండగా అప్పటికే ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. కంటైనర్ లారీని తప్పించే క్రమంలో దానికి గీత పడగా బస్సు డ్రైవర్ వచ్చి ఇండికేటర్లు ఆన్ చేయాలని లారీ డ్రైవర్‌ను మందలించాడు. ఉదయం 4.45 గంటలకు నేను ఇంటికి వెళ్లిన ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
– బండారు వెంకటనారాయణ, ప్రత్యక్ష సాక్షి


