ఉద్యోగుల సమరభేరి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమరభేరి

Aug 27 2026 1:48 AM | Updated on Aug 27 2026 1:48 AM

సాక్షి యాదాద్రి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అసంతృప్తి పరాకాష్టకు చేరింది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో హక్కుల సాధనకు ఉద్యమబాట పట్టారు. జాయింట్‌ యాక్ష న్‌ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం మహాధర్నాకు పిలుపునిచ్చారు. 45 ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విభాగాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునే వరకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

● వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని రెండవ పీఆర్‌సీని ప్రకటించాలి.

● నిలిచిపోయిన ఆరు విడతల కరువు భత్యాన్ని బకాయిలతో సహా చెల్లించాలి.

● కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని ఎత్తివేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి.

● జీపీఎఫ్‌, మెడికల్‌ బిల్లులు, లీవ్‌ సరెండర్లు, రిటైర్డ్‌ ఉద్యోగుల తుది సెటిల్మెంట్లకు సంబంధించి రూ. 10,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

● కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.

● ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.

ఫ అమలు కాని రెండో పీఆర్‌సీ

ఫ పెండింగ్‌లో ఆరు డీఏలు ..

ఫ అస్తవ్యస్థంగా ఈహెచ్‌ఎస్‌ విధానం

ఫ నేడు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

ఫ హాజరుకానున్న ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement