రామన్నపేట: మెరుగైన ఫలితాల సాధన ద్వారా జిల్లాను రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలపాలని ఇంటర్‌బోర్డు జిల్లాఅధికారి(డీఐఈఓ) బి.సురేష్‌రెడ్డి కోరారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ ఉచితంగా సరఫరా చేసిన నోట్‌బుక్స్ పంపిణీచేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లోనూ త్వరలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి కసరత్తు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ సి.జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు ప్రసూనాదేవి, పున్నారావు, మాల వెంకట్‌రెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నర్సింహారావు, రాజేశ్వరి, అశోక్‌కుమార్, శ్రీకాంత్, నాగేష్, అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రవణ్‌కుమార్, నాగమణి, నాన్ టీచింగ్‌స్టాఫ్ పుష్పలత, నర్సయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ డీఐఈఓ సురేష్‌రెడ్డి


