నల్లగొండ టూటౌన్: నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కేసాని రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులకు ఆయన రూ.8 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌తో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి సతీమణి భవ్యశ్రీ, ఆమె పిల్లల కోసం రూ. 8 లక్షలు ఫిక్స్‌డ్ చేసి డిపాజిట్ పత్రాలను వారికి అందజేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా నల్లగొండ నియోజకవర్గ నాయకులు కూడా తగినంత ఆర్థికసాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అనుముల మండలం కట్టవారిగూడెంలో నిర్వహించిన రాజశేఖర్‌రెడ్డి అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, బోనగరి దేవేందర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


