ఆత్మకూరు(ఎం): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన వ్యాపార ధోరణిలో సాగుతోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. సోమవారం ఆత్మకూరు.ఎం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో విలువైన భూములను కబ్జా చేయడానికి 20 మంది రిటైర్డ్ అధికారులను నియమించుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ను కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని భూఆక్రమణలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా నాయకులు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, ఆత్మకూరు(ఎం) సర్పంచ్ బీసు ధనలక్ష్మి, నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, నాతి రాజు, సోలిపురం అరుణ, హైమద్, కోరె బీరప్ప, గుడ్డెటి శ్రీను, రంగ సత్యనారాయణ ఉన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత


