భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. గ్రామపంచాయతీ ఎంప్లాయీస్,వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతి రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు మాట్లాడుతూ గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా విధుల్లో ఉంటూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల సమస్యల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొట్ట యాదమ్మ, రకరకంటి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షం జ్ఞానేశ్వర్, నాయకులు కిష్టయ్య, పరమేష్, కార్మికులు పాల్గొన్నారు.


