భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ ఫోర్సెస్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఖగోళశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీరాం ‘స్పేస్ ఆస్ట్రో ఫిజిక్స్ అండ్ సొసైటీ అవర్ ప్లేస్ ఇన్ ది యూనివర్స్’ అనే అంశంపై ప్రసంగించారు. సూర్యుడు, గెలాక్సీలు, సన్ స్పాట్స్, ఖగోళశాస్త్రంలోని ఆసక్తికరమైన అంశాలను ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత, వైస్ ప్రిన్సిపల్ జి. కృష్ణవేణి, భౌతికశాస్త్ర హెచ్‌ఓడీ కె. స్పందన, అధ్యాపకులు పాల్గొన్నారు.


