‘స్కౌట్స్‌’తో విద్యార్థుల్లో క్రమశిక్షణ | - | Sakshi
Sakshi News home page

‘స్కౌట్స్‌’తో విద్యార్థుల్లో క్రమశిక్షణ

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

భువనగిరి: స్కౌట్స్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు సేవాభావం ఏర్పడుతుందని పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయం నల్లగొండ ప్రిన్సిపాల్‌ శ్రీనివా సులు అన్నారు. భువనగిరిలోని పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో సోమవారం కేంద్రియ విద్యాలయ సంఘటన్‌ హైదరాబాద్‌ రీజియన్‌ ఆధ్వర్యంలో స్కౌట్స్‌ తృతీయ సోపాన్‌ టెస్టింగ్‌ క్యాంప్‌ 2026– 27 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్కౌట్స్‌ ద్వారా విద్యార్థుల్లో సమయపాలన, దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఈ నెల 26 వరకు స్కౌట్స్‌ తృతీయ సోపాన్‌ టెస్టింగ్‌ క్యాంప్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో భువనగిరి కేవీ ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి, క్యాంప్‌ లీడర్‌ జగన్మోహన్‌రావు, స్కాట్స్‌ ఎగ్జామినర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement