దివ్యాంగ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

భువనగిరి: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని డీఈఓ భిక్షపతి అన్నారు. సోమవారం భువనగిరిలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విలీన విద్య సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, స్టేట్‌ రిసోర్స్‌పర్పన్‌ శివరాజ్‌, జిల్లా రిసోర్స్‌పర్సన్‌ రాజేంద్రప్రసాద్‌, భాస్కర్‌, సంధ్యారాణి, జంగమ్మ పాల్గొన్నారు.

మహాధర్నాను

విజయవంతం చేయాలి

భువనగిరి: కలెక్టరేట్‌ ఎదుట ఈ నెల 27న నిర్వహించే మహాదర్నాను విజయవంతం చేయాలని టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి మహ్మద్‌ ఖాదీర్‌ కోరారు. భువనగిరి పట్టణంలోని వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో ఉద్యోగులను సోమవారం ఆయన కలిసారు. జిల్లా కోశాధికారి శ్రీకాంత్‌, తాలుకా అధ్యక్షులు ఆనంద్‌, శశికాంత్‌గౌడ్‌, ఉపేష్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement