భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖి పరిధిలోని మలక్‌పేట మహాత్మా జ్యోతిరావుపూలే , కార్వాన్ బీసీ గురుకుల విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌత్‌జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14, 17 విభాగాల క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపల్ టి. శ్వేత తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అండర్–17 విభాగంలో 1500 మీటర్ల రన్నింగ్ పోటీలలో శ్రీనాథ్ మొదటిస్థానం, వరుణ్ ద్వితీయ స్థానంతో పాటు 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సురేందర్ ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. అదేవిధంగా అండర్–14 విభాగంలో 600 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సంతోష్ ద్వితీయ స్థానంలో నిలిచి మెడల్ సాధించినట్లు చెప్పారు. ఏటీపీ రవి శేఖర్, జ్యోత్స్న, పీడీలు సతీష్, హేమంత్‌కుమార్ పాల్గొన్నారు.


