చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో చేపట్టిన అండర్‌పాస్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈ పనులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరు నెలలు గడుస్తున్నా నిర్మాణ పనుల్లో ఏమాత్రం వేగం పెరగలేదన్నారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వినతిపత్రం అందించిన వారిలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ శేఖర్, నాయకులు బత్తుల సింహాద్రి, తెలంగాణ భిక్షం, పొట్ట జంగయ్య, గుండు లింగన్న, సుర్వి లింగస్వామి, నలపరాజు రమేష్ తదితరులున్నారు.


