రక్తదాన శిబిరం | - | Sakshi
Sakshi News home page

రక్తదాన శిబిరం

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపల్‌ కార్యాలయంలో బ్రహ్మ కుమారీస్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 51 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్‌ వెల్లడించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ బరిగె రమ్య, కౌన్సిలర్లు, తదితరులున్నారు.

చౌటుప్పల్‌ : పట్టణ కేంద్రంలోని బ్రహ్మకుమారీస్‌ మెడిటేషన్‌ సెంటర్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ దేప రమ్యరాజు, డాక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానికులు లక్ష్మీపతి, మురళి, వెంకటేశం, సత్యనారాయణ, ఆనంద్‌, పాండు, ముత్యాలు, రంజిత్‌, రమేష్‌, నర్సింహులు, నరేష్‌, రహీం పాల్గొన్నారు.

అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మించాలి

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2010లో 163 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణమే సింగన్నగూడెం చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నిలిగొండ కృష్ణ, నాయకులు దొక్కా నర్సింహ, కాటం, కృష్ణ, దిగంబర్‌, శివ పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ

మండల కమిటీ ఎన్నిక

అడ్డగూడూరు: మండల కేంద్రంలో సోమవారం పీఆర్‌ఎటీయూ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కూరాకుల రవీందర్‌, ప్రధాన కార్యదర్శిగా కూరెళ్ల యాకస్వామి, అసోసియేషన్‌ అధ్యక్షుడిగా దూదిగాని నరేష్‌, మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షుడిగా మహేష్‌, మహిళా ఉపాధ్యక్షురాలు బైరెడ్డి సరిత, కార్యదర్శి గొడశాల నాగరాజు, మహిళా కార్యదర్శిగా ఎస్‌ కవిత ఎన్నికయ్యారు.

రైతులు వివరాలు

నమోదు చేసుకోవాలి

యాదగిరిగుట్ట రూరల్‌: సన్న రకాల విత్తనాలను సాగు చేసే రైతులు తమ వివరాలను వచ్చే నెల 10 లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి సుధారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సిఫార్సు చేసిన ఏడు రకాల సన్న రకాల వరి విత్తనాలను సాగు చేస్తుంటే, ఆ విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. రైతులు ఇతర మార్గాల ద్వారా విత్తనాలు పొంది సాగు చేస్తున్నట్లయితే, సంబంధిత రైతు వేదిక వద్ద స్వయం ధృవీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు.

ఆలయ హుండీ ఆదాయం రూ.2.11 లక్షలు

భువనగిరి: పట్టణ శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. మొత్తం 8 నెలల 19 రోజులకు సంబంధించి రూ.2,11,826 వచ్చినట్లు ఆలయ ఈఓ నరేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ పరిశీలకులు నిఖిల్‌, కానిస్టేబుల్స్‌ గోపి, అయిలయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ వీరయ్య పాల్గొన్నారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి

బాలికపై లైంగిక దాడి

ఆలేరురూరల్‌ : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన చందు అనే యువకుడు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి బాలికను గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని భయబ్రాంతులకు గురిచేశాడు. బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలిక తల్లి ఆలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.

నేడు వన మహోత్సవం

భూదాన్‌పోచంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం సామూహిక వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, యువకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement