ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

భువనగిరి: భువనగిరి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా గౌస్‌నగర్‌ గ్రామం నుంచి ఒక దరఖాస్తు స్వీకరించినట్లు ఎంపీఓ దినకర్‌ తెలిపారు.

అడ్డగూడూరు: ప్రజాసమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహింస్తోదని ఎంపీడీఓ శంకరయ్య తెలిపారు. సోమవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్‌ శేషగిరిరావు, ఏఓ పాడురంగాచారి, సూపరింటెండెంట్‌ దేవేందర్‌రావు, ఏఈ గోపిసింగ్‌, మండల వైద్యాధికారి భార్గవి పాల్గొన్నారు.

రామన్నపేట: మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇద్దరు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపైన దరఖాస్తులను సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ.రాములు, తహసీల్దార్‌ లాల్‌బహదూర్‌శాస్త్రి, ఏఓ ఎజాజ్‌అలీఖాన్‌, మండల విద్యాధికారి టి.సురేందర్‌రెడ్డి, ఏఎస్‌ఐ సురేందర్‌ ఏఈలు ఆశీష్‌రాఘవ, సురేష్‌ పాల్గొన్నారు.

వలిగొండ : మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఎంపీడీఓ నోడల్‌ అధికారి జలంధర్‌ రెడ్డి అన్నారు. సోమవారం వలిగొండలో నిర్వహించిన ప్రజావాణిలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ పల్లవి, వ్యవసాయ అధికారి అంజనీదేవి, ఎంఈఓ భాస్కర్‌, వైద్యాధికారి జ్యోతి, ఏఈలు సందీప్‌ రెడ్డి పాల్గొన్నారు.

బొమ్మలరామారం: మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి 9 దరఖాస్తులు వచ్చినట్లు ప్రజావాణి నోడల్‌ అధికారి శ్యామల తెలిపారు. రెవెన్యూ శాఖకు 6, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి 2, బీసీ వెల్ఫేర్‌ శాఖకు ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్‌ తహసీల్ధారు సునీల్‌ కుమార్‌, ఏవో దుర్గేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అశోక్‌, హౌసింగ్‌ ఏఈ రోహిత్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లావణ్య, ఎంపీడీఓ రాములు నాయక్‌ పాల్గొన్నారు.

గుండాల : మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ఒక్క దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీఓ చండీరాణి తెలిపారు. తహసీల్దార్‌ హరికృష్ణ, పశు వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి: మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 9 అర్జీలను స్వీకరించినట్లు ఎంపీడీఓ విజయ తెలిపారు. మండల పరిషత్‌ పరిధిలో 4, ఇరిగేషన్‌ శాఖకు చెందిన 2, రెవెన్యూ శాఖకు చెందిన 3 దరఖాస్తులను సంబంధిత అధికారులకు పంపించామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయాధికారిణి శైలజ, ఎంపీఓ శ్రీమాలిని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement