చదువుకు చేయూత.. ప్రతిభకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

చదువుకు చేయూత.. ప్రతిభకు ప్రోత్సాహం

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

ఆలేరు : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ తహసీల్దార్‌ ఎండీ అన్వర్‌ తాను చదువుకున్న పాఠశాలలోని విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు తనవంతు చేయూత అందిస్తున్నారు. ఆలేరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.10వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5వేల చొప్పున ప్రతి ఏడాది తన సోదరుడు దివంగత ఎండీ గౌస్‌ పేరిట స్కాలర్‌షిప్‌ అందజేస్తానని వెల్లడించారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన శ్రీరోల్‌ మోడల్‌శ్రీ కార్యక్రమంలో అన్వర్‌ పాల్గొని మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకు, ఇక్కడి విద్యార్థులకు తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా గతేడాది పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన పాఠశాల విద్యార్థిని ఎండీ నమ్రిన్‌కు రూ.10వేలు ఆయన అందజేశారు. అనంతరం అన్వర్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించింది. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం రావుల సత్యనారాయణరెడ్డి, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్‌, ఉపాధ్యాయులు హేమలత, సుజారాణి,శోభ, పరమేశ్వర్‌, మేఘరాజు, శంకర్‌రెడ్డి, పూల నాగయ్య, వెంకటేష్‌యాదవ్‌, నాగరాజు, సురేష్‌, బాబా తదితరులు పాల్గొన్నారు.

సోదరుడి జ్ఞాపకార్థం టెన్త్‌ టాపర్లకు

ఆర్థికసాయం అందజేస్తున్న తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement