మూడు సంవత్సరాల పీఆర్‌సీ, వివిధ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేయాలి. ఆరోగ్య పథకం సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. ఉద్యోగుల, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తు కార్యాచరణకు దిగుతాం. – మందడి ఉపేందర్‌రెడ్డి,
ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్
విజయవంతం చేయాలి
ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలి. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఆరోగ్య పథకం సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేనిపక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తాం.
– భగత్, ఉద్యోగ జేఏసీ జిల్లా జనరర్
సెక్రటరీ, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు


