యాదగిరి క్షేత్రంలో ఊంజల్‌ సేవోత్సవం | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో ఊంజల్‌ సేవోత్సవం

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. శ్రావణమాసం కావడంతో ఆండాళ్‌ అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక సేవపై అధిష్టించి తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి, పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పూజలు చేసి, హారతినిచ్చారు. అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవ నిర్వహించారు.

ఫిర్యాదులపై వేగంగా

స్పందించాలి

చౌటుప్పల్‌ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ అన్నారు. శుక్రవారం ఆయన చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌ నిర్వహణ, జనరల్‌ డైరీ ఎంట్రీలు, వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది, పోలీస్‌స్టేషన్‌ కార్యకలాపాలపై సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సమర్థవంతమైన సేవల కోసం సరైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి పట్ల స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. సోషల్‌ మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. సైబర్‌ నేరగాళ్లు అవలంబిస్తున్న కొత్త మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడమే కాకుండా నేరాలను ముందుగానే నివారించడం ముఖ్యమన్నారు. క్రమశిక్షణ, నిజాయితీ, వృత్తినైపుణ్యం, ప్రజల పట్ల మర్యాదపూర్వక ప్రవర్తన సమర్థవంతమైన పోలీసింగ్‌కు ప్రాథమిక సూత్రాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్‌, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, సిబ్బంది తదితరులున్నారు.

ఎకై ్సజ్‌ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

భువనగిరిటౌన్‌ : జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్స జ్‌ శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడిగా దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిగా భాను చందర్‌, కోశాధికారిగా అనిల్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రెసిడెంట్‌గా జానయ్య, జాయింట్‌ సెక్రటరీగా ప్రభు వరం, పబ్లిసిటీ సెక్రటరీగా నాగేంద్ర బాబుతో పాటు ఈసీ మెంబర్లుగా శ్రీను, షాహిన్‌ బేగం బాధ్యతలు స్వీకరించారు.

పెండింగ్‌ పనులు

పూర్తి చేయాలి

భువనగిరిటౌన్‌ : నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ భూసేకరణపై శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రవీందర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సజావుగా కొనసాగేందుకు ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement