అభివృద్ధికి పునరంకితం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పునరంకితం

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

● వానాకాలంలో రూ. 314. 13 కోట్ల రైతు భరోసా

న్యూస్‌రీల్‌

9,650 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

వియత్నాం బుద్ధ విగ్రహం
నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో వియత్నాం దేశానికి చెందిన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

- 8లో

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

21న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ భవానీ శంకర్‌ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. యాదగిరి కొండకు దిగువన ఉన్న శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్‌ 2లో 21వ తేదీ ఉదయం 11 గంటలకు ముత్తైదువులందరూ సామూహిక శ్రీవరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే మహిళలు తమ పేర్లను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5గంటల వరకు శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, సామూహిక వ్రతాన్ని ఉచితంగానే దేవస్థానం నిర్వహిస్తుందని, ఇందుకు సంబంధించిన పూజా సామగ్రి దేవస్థానం అందజేస్తుందని పేర్కొన్నారు.

శ్రీనృసింహ క్షేత్రంలో నిత్య కల్యాణ వేడుక

యాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు విశేషంగా నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

నూతన ఆవిష్కరణలతోనే వికసిత్‌ భారత్‌ సాకారం

భూదాన్‌పోచంపల్లి: నూతన ఆవిష్కరణలతోనే వికసిత్‌ భారత్‌ సాకారం అవుతుందని మాజీ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ పూనం మాలకొండయ్య అన్నారు. శనివారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహించిన స్వతంత్ర వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకొని ముందుకు పోవాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. కాగా అంతకుముందు ఎన్‌సీసీ క్యాడెట్లు నిర్వహించిన పరేడ్‌, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దాసేశ్వర్‌రావు, డీన్లు పాల్గొన్నారు.

అమరుల స్ఫూర్తితో అందరం కలిసిపనిచేద్దాం

నాణ్యమైన విద్యను మరింత చేరువ చేయడానికి ఎలిమెంటరీ స్కూళ్లు

గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం

స్వాతంత్య్ర దినోత్సవంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి

గుడిసెలేని రాష్ట్ర సాధనే ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశలో జిల్లాలో గుడిసెలు ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేస్తోంది. – గుత్తా సుఖేందర్‌రెడ్డి

సాక్షి, యాదాద్రి: అమర వీరుల ఆశయాల స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్దామని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్రవేడుకల్లో గుత్తా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించాం. పరిశుభ్రత, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక వసతులు, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం.

ఎలిమెంటరీ స్కూళ్ల ఏర్పాటు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని విస్తరించడంతో పాటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని చేపడుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఎలిమెంటరీ స్కూళ్ల ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్యను మరింత చేరువ చేస్తోంది.

చేయూత పథకంలో..

జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, కల్లుగీత, చేనేత, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొత్తం 95,779 మంది ఉన్నారు. వీరందరికీ నెలకు రూ.24.11కోట్ల పింఛన్‌ పంపిణీ చేస్తున్నాం. కొత్త చేయూత పింఛన్ల మంజూరు ప్రారంభమైంది. దీనికోసం ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మహిళా స్వయం సహాయక సభ్యులకు డ్రోన్‌, మొబైల్‌ మిల్లెట్‌ కేఫ్‌ పై శిక్షణ, యూనిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. జిల్లాలోని 35 మహిళా స్వయం సహాయక సభ్యులకు శిక్షణ ఇచ్చాం.

గంధమల్లతో 56వేల ఎకరాలకు నీరు

గంధమల్ల రిజర్వాయర్‌ 1.41 టీఎంసీల నీటి సామర్థ్యంతో రూ.358 కోట్ల 16 లక్షలతో ఒప్పందం చేశాం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి, 50 చెరువులను నింపడానికి వీలవుతుంది. ఇప్పటివరకు కట్ట నిర్మాణానికి రూ. 27 కోట్ల 18 లక్షల పరిహారం చెల్లించారు. ముంపు ప్రాంతాలకు నష్ట పరిహారం కింద రూ. 87 కోట్ల 97 లక్షలు విడుదల చేశారు. త్వరలో ఈ నష్ట పరిహారం లబ్ధిదారులకు చెల్లిస్తాం. బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి చేయడానికి రూ. 195 కోట్ల తో ఒప్పందం అయ్యింది. ఈ కాలువ ద్వారా 14 వేల 575 ఎకరాల నూతన ఆయకట్టు ఏర్పడుతుంది.

నిరుపేదలకు సన్నబియ్యం..

జిల్లాలో ప్రతి నెలా 515 రేషన్‌ షాపుల ద్వారా అర్హత కలిగిన 2,52,265 కుటుంబాలకు 5 వేల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. రేషన్‌ కార్డులు కలిగిన 2,52, 265 కుటుంబాలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాం.

నేతన్నకు పొదుపు పథకం అమలు

జిల్లాలో 7,719 చేనేత మగ్గాలు 2, 240 మర మగ్గాలకు జియో ట్యాగింగ్‌ చేశారు. చేనేత, అనుబంధ కార్మికుల కోసం నేతన్నకు పొదుపు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా 10,790 మంది చేనేత అనుబంధ కార్మికులు నమోదు చేసుకోగా రూ. 34 కోట్లు విడుదల చేశాం. ఈ వేడుకల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి , ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీ వాణి, గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, జిల్లా అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రైతుభరోసా పథకం క్రింద ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. వానాకాలం 2026–27 సంవత్సరంలో రూ. 314. 13 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేశాం. 2025–26 యాసంగి సాగుకు సంబంధించి 359 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 5,25,538 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి రూ.1,245 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశాం. కాగా, సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించాం.

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

రుణాలు, ఆస్తుల పంపిణీ

భువనగిరిటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోగతికి, స్వయం ఉపాధి ప్రోత్సాహకానికి ప్రభుత్వం భారీగా రుణాలు పంపిణీ చేసింది. భువనగిరి పట్టణంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్రవేడుకల్లో డీఆర్‌డీఏ–సెర్ప్‌ బ్యాంక్‌ లింకేజీ కింద 1,687 స్వయం సహాయక సంఘాలకు రూ. 162.67 కోట్ల రుణాల చెక్కు, పట్టణ మెప్మా ద్వారా 329 స్వయం సహాయక సంఘాలకు రూ. 45.21 కోట్ల రుణాల చెక్కును మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు స్వీకరించారు. వీటితో పాటు జిల్లా మహిళా సమాఖ్యకు డ్రెస్సుల పంపిణీ నిమిత్తం రూ. 75 లక్షల చెక్కును అందజేయగా, స్వయం ఉపాధి ప్రోత్సాహకాల్లో భాగంగా 10 మంది లబ్ధిదారులకు రూ. 37.20 లక్షల విలువైన మిల్లెట్‌ కేక్‌ యూనిట్లను ఇచ్చారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

విజ్ఞాన్‌ హైస్కూల్‌, బస్వాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశశాల, కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, ప్రెసిడెన్సీ హైస్కూల్‌, బొమ్మలరామారం కేజీబీవీ విద్యార్థులు జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శించిన నత్యాలు, రూపకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులను శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు, అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమసేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అతిథులు తిలకించారు.

స్మార్ట్‌ రేషన్‌కార్డు అందజేస్తున్న శాసన మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌, అధికారులు తదితరులు

సాక్షి, యాదాద్రి : ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్‌ కార్డు తోపాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డిలతో కలిసి స్మార్ట్‌ రేషన్‌ కార్డులను గుత్తా పంపిణీ చేశారు. జిల్లాలో 2,51,513 స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్‌ కార్డులు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి లబ్ధిదారుకు నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తోందన్నారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ అర్హులైన నిరుపేద కుటుంబాల వారి కోసం మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేఖ బాబురావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్ల పల్లి శ్రీవాణి, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, గ్రంఽథాలయ చైర్మన్‌ అవైస్‌ చిస్తీ, ఆర్డీఓలు మాలి కృష్ణారెడ్డి, శేఖర్‌ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి పాల్గొన్నారు.

ఊరు చేరే లోపే ఆగిన ఊపిరి

పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు బైక్‌పై సొంతూరుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.

- 8లో

ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో 9,650 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, 4,829 గృహప్రవేశాలు పూర్తయ్యాయి. నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 237 కోట్లు జమ చేశాం.

ఫ భువనగిరిలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో గుత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement