భూదాన్‌పోచంపల్లి: పట్టుదల, ఆత్మవిశ్వాసంతోనే విజయం సాధ్యమవుతుందని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ అన్నారు. శనివారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని దేశ్‌ముఖిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిపరేటరీ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి నిరంతరం సాధన అవసరమని అన్నారు. ముఖ్యంగా బాలికలు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఆటంకాలను అధిగమించి విజయాన్ని తీరును విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. కాగా ఎన్‌సీసీ క్యాడెట్ల పరేడ్, ఆర్మీ డ్రిల్ ఆకట్టుకొన్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీలత, వైస్‌ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఏఎన్‌ఓ లెప్టినెంట్ డాక్టర్ రూప, ఆర్మీడ్రిల్ ఇన్‌స్ట్రక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


