భువనగిరిటౌన్ : పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన తండ్రీకొడుకులు ఒకే వేదికపై జిల్లా స్థాయి ఉత్తమ సేవా పతకాలు అందుకొని అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ చేతుల మీదుగా ఎస్‌ఐ ఎస్.కె. మదార్ సాహెబ్ , ఆయన కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ ఎస్.కె. సలీమ్ ఈ అవార్డులు స్వీకరించారు. 30 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించడమే కాకుండా.. రాష్ట్రంలో సంచలనం సష్టించిన దిశ, నయీం, హాజీపూర్ వంటి కేసుల దర్యాప్తులో మదార్ సాహెబ్ కీలకంగా వ్యవహరించారు. తండ్రీకొడుకులకు ఒకేసారి పురస్కారాలు లభించడం పట్ల పలువురు అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


