ఈ–కేవైసీ.. తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఈ–కేవైసీ.. తీవ్ర జాప్యం

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

లోకోస్‌ యాప్‌లో నమోదు ఇలా.. ప్రక్రియను వేగవంతం చేస్తాం

పొదుపు సంఘాల సమస్త సమాచారాన్ని (ఆర్థిక ప్రగతి, తీసుకున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, చెల్లించిన వడ్డీ, సీ్త్రనిధి రుణాలు, కొనసాగిస్తున్న వ్యాపారం, లాభాలు తదితర వివరాలు) ఇప్పటికే లోకోస్‌ యాప్‌లో నిక్షిప్తం చేశారు. తాజాగా సభ్యుల ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఈ–కేవైసీ చేస్తున్నారు. లోకోస్‌ యాప్‌లో సభ్యురాలి ఫొటోను అథెంటికేషన్‌ చేయాలి. ప్రస్తుత ఫొటో, ఆధార్‌ కార్డులోని ఫొటో ఒకేలా ఉంటేనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ఆలేరురూరల్‌: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా అందించేందుకు చేపట్టిన ఈ–కేవైసీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అర్హులైన వారికే లబ్ధి చేకూర్చాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లోకోస్‌ యాప్‌లో ఈ–కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. కానీ అధికారుల అలసత్వం, సాంకేతిక స మస్యల కారణంగా జిల్లాలో 10శాతమే నమోదైంది.

అనర్హులకు చెక్‌

గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ఏ విధంగా అయితే నేరుగా జమ చేస్తున్నారో.. అదే తరహాలో మహిళా సంఘాల సభ్యులకు కూడా కేంద్ర పథకాలను అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా మహిళాభ్యున్నతికి కేటాయించే నిధులను సైతం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసే అవకాశం ఉంది. ఇందుకోసమే సభ్యులందరికీ ఈ–కేవైసీ తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయితే అనర్హులుగా ఉంటూ మహిళా సంఘాల్లో కొనసాగుతున్న వారికి శాశ్వతంగా చెక్‌ పడుతుందని అధికారులు చెబుతున్నారు.

నమోదుకు ఆటంకాలు..

చాలా మంది సభ్యులకు ఆధార్‌ కార్డులోని ఫొటోలకు, ఇప్పటి ముఖకవళికలకు పొంతన కుదరకపోవడంతో ఈ–కేవైసీ ఫెయిల్‌ అవుతోంది. అలాగే మొబైల్‌ నంబరు తప్పనిసరిగా ఆధార్‌కు అనుసంధానమై ఉండాలి. ఆధార్‌ అప్‌డేట్‌ లేకపోయినా, ఫోన్‌ నంబర్‌ లింక్‌ కాకపోయినా ముందుగా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి నవీకరణ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాతే ఈ–కేవైసీ చేయించుకోవాలి. దీనికి తోడు అధికారుల అలసత్వం కూడా తోడవడంతో నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఆమడదూరంలో లక్ష్యం..

జిల్లా వ్యాప్తంగా 17 మండలాల పరిధిలో 652 గ్రామైక్య సంఘాలు, 15,439 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,62,546 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఈ–కేవైసీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం 10 శాతం కూడా నమోదు కాలేదు.

జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. దీనిని పూర్తి చేయడంలో మనం కొంతమేర వెనుకబడి ఉన్నాం. అయితే సభ్యులందరూ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– కట్ట వెంకటేశం, డీపీఓ

ఫ 1,62,546 మంది మహిళా సంఘాల సభ్యులు

ఫ ఇప్పటివరకు కేవలం 10శాతం ఈ–కేవైసీ పూర్తి

ఫ అధికారుల అలసత్వం, ఆధార్‌ అప్‌డేట్‌ సమస్యలతో నత్తనడకన ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement