చౌటుప్పల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం చౌటుప్పల్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్, మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని సమస్యలను కూడా పరిష్కరించకుండా పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసనలు చేపట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్శిత్‌రెడ్డి, మున్సిపల్, మండల అధ్యక్షులు కడారి కల్పనయాదవ్, కై రంకొండ అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు తంగెళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేష్, బోయ మహేంద్రమణి, టేకుల మంజు, కై రంకొండ స్వప్న, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, ఆలె శ్రీలతచిరంజీవి, పోలేపల్లి లక్ష్మీముత్తయ్య, నాయకులు రమనగోని శంకర్, ముత్యాల భూపాల్‌రెడ్డి, కంది లక్ష్మారెడ్డి, గడ్డం నర్సింహ, బత్తుల జంగయ్య, యాస అశోక్‌రెడ్డి, బర్మ నాగరాణి, ఊదరి దివ్య పాల్గొన్నారు.


