14వేల మంది ఓటర్ల వలస | - | Sakshi
Sakshi News home page

14వేల మంది ఓటర్ల వలస

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

నియోజకవర్గాల వారీగా సర్‌ వివరాలు

ఆలేరు అంశం భువనగిరి

2,38,040 మొత్తం ఓట్లు 2,21,903

2,38,040 ఫారాల పంపిణీ 2,21,903

2,27,813 డిజిటలైజేషన్‌ 2,06,009

3,503 చనిపోయిన ఓట్లు 3,653

4,363 షిఫ్టెడ్‌ ఓట్లు 10,241

1,953 డబుల్‌ ఓట్లు 1,117

341 ఆబ్సెంట్‌ ఓట్లు 835

67 ఇతర ఓట్లు 48

సాక్షి, యాదాద్రి: ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. 94.31శాతం డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా నిలిచింది. నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో ఫారాల డిజిటలైజేషన్‌ వందశాతం అయ్యింది. రెండు నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ కాని 26,121 ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 2002 ఓటర్ల ఆన్‌ మ్యాపింగ్‌ ఓట్లు కూడా జాబితానుంచి తొలగిపోనున్నాయి. అయితే అన్‌ మ్యాపింగ్‌ ఓటర్లకు మరో అవకాశం నోటీస్‌ రూపంలో ఇస్తున్నారు. వీరు ఎన్నికల కమిషన్‌ గుర్తించిన కార్డుల్లో ఏదో ఒకటి ఆధారంగా చూపించి ఓటు హక్కును పొందవచ్చు.

433822 ఫారాల డిజిటలైజేషన్‌

జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో మొత్తం 4,59,943 ఓట్లు ఉన్నాయి. ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 566మంది బీఎల్‌ఓలు 4,59,943 ఎన్యుమరేషన్‌ ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో 433822 ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. బీఎల్‌ఓలు 26,121 ఫారాలు సేకరించలేకపోయారు. వీటిలో చనిపోయిన ఓటర్లు 7,156, వలస వెళ్లినఓటర్లు 14,604 మంది,డబుల్‌ ఓట్లు 3,070, అబ్సెంట్‌ ఓట్లు 1,176, ఇతర ఓట్లు 115 ఇలా మొత్తం 26,121 ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది.

ఇంటింటికీ తిరిగి..

ఎన్యుమరేషన్‌ ఫారాలు వంద శాతం డిజిటలైజేషన్‌ పూర్తయిన పోలింగ్‌కేంద్రాలు జిల్లాలో నాలుగుఉన్నాయి. వీటిలో బొమ్మలరామారం మండలం తిర్మలగిరి పోలింగ్‌కేంద్రం నంబర్‌ 27,మోటకొండూరు మండలం చందేపల్లి మధిర గ్రామమైన దుర్సగాని పల్లి పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 236,గుండాల మండలం వంగాల పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 272 ఉన్నాయి. ఆయా గ్రామాలలో బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఇచ్చిన ప్రతి ఫాంను డిజిటలైజ్‌ చేశారు.

ఫ ముగిసిన ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ

ఫ డిజిటలైజేషన్‌ 94.31 శాతం

ఫ 26,121 ఓట్లు తొలగించే అవకాశం

ఫ 17న ముసాయిదా ఓటరు జాబితా

మోటకొండూరు మండలం చందేపల్లి మధిర గ్రామమైన దుర్సగాని పల్లి పోలింగ్‌కేంద్రం 236 లో బీఎల్‌ఓ పానుగంటి దేవేంద్ర పక్కా ప్రణాళికతో 125ఓట్లకు గాను వందశాతం డిజిటలైజేషన్‌ చేశారు. సర్‌ ప్రక్రియ రాకముందునుంచే చనిపోయిన ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డైట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement