కిట్‌లోని ముఖ్యమైన వస్తువులు
భువనగిరి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంతో పాటు ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఉచితంగా వెల్కమ్ కిట్లు అందజేయడంతో పాటు, అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రత్యేక కోచింగ్‌తో పాటు అత్యాధునిక వసతుల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తోంది. తాజాగా ప్రారంభించిన ఈ పథకాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని కళాశాలల్లో అమలవుతున్న ఈ పథకాలను ఇప్పుడు మిగిలిన కాలేజీలకు కూడా విస్తరిస్తున్నారు. ఈ విప్లవాత్మక మార్పుల కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లాలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
తొమ్మిది రకాల వస్తువులతో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సుమారు 4 వేలకు పైగా ఉన్నారు. వీరందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన ఆకర్షణీయమైన వెల్కమ్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లకు సంబంధించిన నోట్‌బుక్‌లు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఆగస్టు 15 నుంచి ఈ కిట్ల పంపిణీ అధికారికంగా ప్రారంభంకానుంది.
అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి సన్నాహాలు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పౌష్టికాహార పథకం కేవలం విద్యార్థులకే కాకుండా, కళాశాలల అధ్యాపకులకు సైతం వర్తింపజేయనున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు వెల్కమ్ కిట్లతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతో మేలు కలిగిస్తుంది. యూనిఫాం ధరించడం వల్ల అంతా సమానమనే అన్న భావన విద్యార్థుల్లో ఏర్పడుతుంది. ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు వల్లే ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం.
–సురేష్‌రెడ్డి, డీఐఈఓ
ఫ 15 నుంచి అమలు
ఫ సుమారు 4 వేల మంది విద్యార్థులకు లబ్ధి
ఫ తొమ్మిది రకాల వస్తువులతో కిట్లు
ఫ ఇప్పటికే జిల్లాకు చేరుకున్న నోట్‌బుక్స్
ఒకటి లేదా రెండు జతల యూనిఫాం, షూస్, సాక్సులు, టై, బెల్ట్, 12 నోట్‌బుక్స్, రికార్డు బుక్స్, ఇతర అవసరమైన విద్యా సామగ్రి


