గర్భంలోనే అంతం! | - | Sakshi
Sakshi News home page

గర్భంలోనే అంతం!

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

ప్రత్యేక నిఘా పెడతాం

భువనగిరి: పుట్టకముందే ఆడబిడ్డగా ముద్రపడి ఈ లోకాన్ని చూడకుండానే కన్నుమూస్తున్న పసికూనలెందరో.. అమ్మ ఒడిలోకి చేరి ఆడుతూ పాడాల్సిన పసిపాపలు గర్భంలోనే అంతమైపోతున్నారు. జిల్లాలో గత నాలుగేళ్లుగా ఆడ, మగ పిల్లల జననాల మధ్య పెరుగుతున్న వ్యత్యాసమే ఈ దుస్థితికి సాక్ష్యంగా నిలుస్తోంది. జిల్లాలో బాలికల జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ సేకరించిన గణాంకాలు పరిశీలిస్తే ఆడమగ జననాల మధ్య అంతరం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా..

జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారి సంఖ్య పెంచేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, మెప్మా, విద్యాశాఖకు చెందిన అధికారులు ఆడపిల్లలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలు, పథకాలు, వారి సంరక్షణ, ఆడపిల్లలను కనడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పురావడంలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కానింగ్‌ సెంటర్లను తూతూ మంత్రంగా తనిఖీ చేయడం తప్ప నిరంతరం నిఘా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు, భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి.

డబ్బులకు ఆశపడి..

పలు స్కానింగ్‌ సెంటర్లు డబ్బులకు ఆశపడి.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలకు కమీషన్లు ముట్టజెప్పి వారి ద్వారా లింగ నిర్ధారణ కోసం స్కానింగ్‌ చేయడానికి రిఫర్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.15వేల నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే తుంచేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేసి సీజ్‌ చేసినప్పటికీ రాజకీయ పలుకుబడితో తిరిగి అనుమతులు తెచ్చుకుంటూ మళ్లీ నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు జిల్లా కేంద్రంతో పాటు తుర్కపల్లి, బొమ్మలరామారం, ఆత్మకూర్‌, మోత్కూర్‌, చౌటుప్పల్‌, రాజాపేట, నారాయణపురం మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెడతాం. పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ట్రైబల్‌ ఏరియాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో చాలా వరకు స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గిపోయాయి. ఇంకా ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం అందితే వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– మనోహర్‌, డీఎంహెచ్‌ఓ

నాలుగేళ్లుగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు

ఫ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్‌ సెంటర్లు

ఫ ఆడపిల్ల అని తేలితే గర్భంలోనే చిదిమేస్తున్న వైనం

గత నాలుగేళ్లుగా బాలికల

జనన నిష్పత్తి వివరాలు..

(ప్రతి వేయి మంది మగ పిల్లలకు)

సంవత్సరం ఆడపిల్లల సంఖ్య

2022 978

2023 880

2024 870

2025 866

2026 జూలై వరకు 856

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement