సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

భువనగిరిటౌన్‌ : సైబర్‌ నేరాలపై అపమ్రత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సురక్షిత డిజిటల్‌ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. సురక్షా తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం భువనగిరిలోని ఫంక్షన్‌హాల్‌లో విద్యార్థులు, పట్టణ ప్రజలకు సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సైబర్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు, సైటెక్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ సందీప్‌ ముదల్కర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవైస్‌చిస్తీ, డీఎస్పీ రవీందర్‌, శ్రీనివాస్‌నాయడు, మధుసూదన్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement