అండర్‌పాస్ నిర్మాణంలో జంక్షన్లు మూసివేయడంతో ద్విచక్రవాహనాలు కూడా పోయేందుకు దారి లేదు. బైక్‌పై రోజూ మూడు సార్లకుపైగా కిలోమీటర్ల కొద్ది వెళ్లి యూటర్న్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. దీంతో బైక్‌ను పక్కన పెట్టి సైకిల్ కొనుగోలు చేసి డ్యూటీకి వెళ్తున్నాను. పనులు పూర్తయ్యే వరకు ఏదో ఓ చోట జంక్షన్ తెరిచి ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా చూడాలి.
– బద్దం భరత్‌కుమార్, మున్సిపాలిటీ
చిరు ఉద్యోగి, చౌటుప్పల్
చౌటుప్పల్ : చౌటుప్పల్ లోని జాతీయ రహదారిపై జరుగుతున్న అండర్‌పాస్ నిర్మాణ పనులు పట్టణ వాసులకు శాపంగా మారాయి. ముందస్తు ప్రణాళిక, సమాచారం ఇవ్వకుండా తంగడపల్లి, బస్టాండ్ చౌరస్తాల్లో ఉన్న జంక్షన్లను పూర్తిగా మూసివేసి పనులు కొనసాగిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరం వెళ్లి రోడ్డు క్రాస్ చేయాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వివిధ వాహనదారులు తమ వాహనాలను తీసుకెళ్లే మార్గం లేక నడిచి వెళ్తున్నారు. కొందరైతే ఏకంగా బైక్‌లను పక్కన పెట్టి సైకిళ్లపై రాకపోకలు సాగిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు
అభివృద్ధి పనులు చేపడితే ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతోపాటు అసౌకర్యం కలగకుండా చూడాలి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే పనులు నిర్వహించాలి. కానీ, ప్రధాన జంక్షన్లను మూసివేసి కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తుండడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్‌పాస్ పనుల వల్ల జంక్షన్లు మూసివేతతో దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లి యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల గురించి ఆలోచించాల్సిన అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా తమకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఫ చౌటుప్పల్‌లో కొనసాగుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులు
ఫ ప్రధాన జంక్షన్ల మూసివేత
ఫ రోడ్డు క్రాసింగ్‌కు వాహనదారుల ఇక్కట్లు
ఫ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలంటున్న పట్టణ వాసులు


