కమ్మేసిన మంచు
రామన్నపేట, భువనగిరిటౌన్, భూదాన్‌పోచంపల్లి : రామన్నపేట, భువనగిరి, పోచంపల్లిని మంచు దుప్పటి కప్పేసింది. శుక్రవారం వేకువజాము నుంచే పొగమంచు దట్టంగా కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా ముందుకు సాగారు. జనజీవనానికి అంతరాయం కలిగింది.చిరు వ్యాపారులు, పాలు, పండ్లు, కూరగాయల వ్యాపారులు 9 గంటల వరకు బయటకు రాలేని పరి స్థితి కనిపించింది. టీ హోటళ్ల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. అయితే కొంతమంది యువకులు, చిన్నారులు పొగమంచును ఆస్వాదిస్తూ కనిపించారు.


