మూగజీవాలకు షుగర్ పరీక్షలు
కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో సూర్యాపేట జిల్లాలోనే మొదటగా జంతువులకు షుగర్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ పెంటయ్య. శనివారం కుక్కలు, పలు పశువులకు షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను రాసిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల చిలుకూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన పెంపుడు కుక్క షుగర్ వ్యాధి లక్షణాలతో మృతిచెందిదని అన్నారు. జంవుతులకు షుగర్ పరీక్షలు చేసే పరికరాలు ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు ఏపీలోని గన్నవరంలోనే ఉన్నాయని, దీంతో పశుపోషకులు దూరప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి స్థానిక పశువైద్యశాలలోనే షుగర్ పరీక్ష కిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఓ వెటర్నరీ ఫార్మా కంపెనీ సహాయంతో షుగర్ పరీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, హరికృష్ణ ఉన్నారు.
కోదాడ పశువైద్యశాలలో ప్రారంభం


